Sep 28,2023 22:04

ప్రజాశక్తి - ముసునూరు
   టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టునకు నిరసనగా గురువారం మండల కేంద్రమైన ముసునూరు మండపం సెంటర్‌ వద్ద న్యాయదేవత న్యాయపక్షాన్న వుండి మా చంద్రబాబు నాయుడికి న్యాయం జరిగేలా చూడమని టిడిపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గద్ధే రఘుబాబు, లక్కపాము కాంతారావు, రాపర్ల ప్రతాప్‌, గద్ధల మెహానరావు, పర్వతనేని వెంకటేశ్వరరావు, సుగసాని వేణు, ఏనుగుధాటి నాగరాజు, రంగు వాసు, పల్లిపాము జీవరత్నం, చలమాల వెంకటేశ్వరరావు, రెడ్డి కృష్ణ, నక్కా యోహాన్‌ న్యాయదేవతను వేడుకోన్నారు.
   టి.నరసాపురం : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విడుదల కోరుతూ మండలంలోని తిరుమలదేవిపేట గ్రామంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పుర వీధుల్లో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట నాయుడు, పండు, వడ్డే శ్రీను, ఎం.దుర్గా రావు, ఎం.సురేష్‌, టి.శ్రీను, సిహెచ్‌ వీర బాబు పాల్గొన్నారు.
   జంగారెడ్డిగూడెం : చంద్రబాబు నాయుడు అరెస్టుపై టిడిపి శ్రేణులు చేపట్టిన నిరసన దీక్ష గురువారం కొనసాగింది. టిడిపి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకుంది. నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన అమరావతి జెఎసి కన్వీనర్‌ కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి 19 రోజులైన తర్వాత కూడా ఎటువంటి ఆధారాలు తెలపకుండా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి కార్యాలయం ఇన్‌ఛార్జి, పాలి ప్రసాద్‌, పరిమి సత్తిపండు, ఆకుమర్తి రామారావు, శ్యాం సుందర శేషు, జగ్గవరపు ముత్తారెడ్డి, బొమ్మాజీ అనిల్‌, సొంగ రోషన్‌, తూటికుంట రాము, రాజన సత్యనారాయణ, అల్లూరి రామకృష్ణ, చిట్రోజు తాతాజీ, మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.