Oct 01,2023 20:25

కందుకూరులో దీక్ష చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అభివద్ధిని గాలికొదిలేసి అరాచక పాలన కొనసాగిస్తున్నారని టిడిపి నేతలు విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 19వ రోజు కొనసాగాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు దీక్షలో పాల్గొన్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి పై, వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ, ఆయనను ఇబ్బంది పెట్టడానికి స్కిల్‌ డెవలప్మెంట్‌ అంశంలో ఏదేదో జరిగిపోయినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పార్టీ నాయకులు నాదెళ్ల వెంకట సుబ్బారావు, గోచిపాతల మోషే, గొల్ల సుధాకర్‌, రావూరి రామకోటయ్య, బొద్దులూరి కొండలరావు, ఈదర సుధాకర్‌, ఉట్లపల్లి మాధవరావు ఉన్నారు.