Sep 28,2023 19:10

నిరసన చేస్తున్న నాయకులు

నిరసన చేస్తున్న నాయకులు
కొనసాగుతున్న టిడిపి దీక్షలు
ప్రజాశక్తి-కావలి:చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలోని గౌడసంఘం నేతలు, టిడిపి కుటుంబ సభ్యులతో గురువారం 15వ రోజు రిలే నిరాహార దీక్షలు ఇన్‌ఛార్జ్‌ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగాయి.దీక్షలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో గౌడ సంఘాలకు జరుగుతున్న అన్యాయాలపై తమ గళం వినిపించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో తమకు ఒరిగిందేమీ లేదని, అన్ని విధాలా అంధకారంలోకి నెట్టిన ఏకైక ప్రభుత్వం ఈవైసీపీ ప్రభుత్వమని ద్వజమెత్తారు.

కార్యక్రమంలో గౌడ సంఘ నేతలు ఉప్పాల శ్రీనివాసులు, కోసూరు వెంకటేశ్వర్లు, నాసిన జాలరావు, బోడుగు వెంకయ్య, తుల్లూరు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.