ప్రజాశక్తి - యంత్రాంగం
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు జిల్లాలొఓ కొనసాగు తున్నాయి. పెద్దాపురం మండలం గోరింటలో చేపట్టిన దీక్షలకు ముఖ్య అతిథులుగా నిమ్మకాయల రంగనాగ్, జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల సత్తి బాబు, పి. సతీష్, టిడిపి మండల అధ్యక్షులు కొత్తిం వెంకటశ్రీనివాసరావు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాలక సెంటర్‌లో నిర్వహిస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులతో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజు రాష్ట్ర కార్యదర్శి కాళ్ల సత్తిబాబు మాజీ జెడ్పిటిసి సభ్యులు మట్టా ప్రకాష్ గౌడ్ బుంగ సింహాద్రి బోళ్ల కష్ణమోహన్ క్లస్టర్ ఇన్చార్జిలు తాతపూడి రామకష్ణ సరిదే నాగ హరినాథ్ గండి వెంకటేశ్వరరావు మిరపల ప్రకాష్ పాల్గొన్నారు.ఏలేశ్వరంలో చంద్రబాబుకు సంఘీభావంగా ఏలేశ్వరం నుంచి యర్రవరం వరకూ టిడిపి నాయకులు పాదయాత్ర నిర్వహించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఈ యాత్రను ప్రారంభించారు. టిడిపి, జనసేన ఇన్చార్జులు వరుపుల సత్యప్రభ, తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో కొనసాగింది. కౌన్సిలర్లు భోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, కోణాల వెంకటరమణ వై.నాగబాబు, పి.శీను, పి.సురేష్ పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ బాలాజీచెరువు సెంటర్ వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరకున్నాయి. మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు మాట్లాడారు. జనసేన సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కరెడ్ల గోవింద్, సోదే ముసలయ్య, బండారు మురళి మద్దతు తెలిపారు.










