Sep 16,2023 21:28

బొబ్బిలి: కాగడాల ప్రదర్శన చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం నెల్లిమర్లలో మేము సైతం చంద్రబాబుకి తోడుగా సంతకాలు సేకరణ జరిపారు. ఈ దీక్షలో మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామినాయుడు టిడిపి నియోజకవర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, నాయకులు మహంతి చిన్నం నాయుడు, కంది చంద్ర శేఖర్‌ రావు, సువ్వాడ రవిశేఖర్‌, సువ్వాడ వనజాక్షి, కడగల ఆనంద్‌ కుమార్‌, గేదెల రాజారావు, పోతల రాజప్పన్న, లెంక అప్పల నాయుడు, బైరెడ్డి లీలావతి, చీకటి సుహాసిని, నల్లం శ్రీనివాసరావు, చింతపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. గుర్ల: మండల టిడిపి నాయకులు శనివారం అచ్యుతాపురం జంక్షన్‌లో ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అచ్యుతాపురం జంక్షన్‌ నుండి చీపురుపల్లి వరకు బైక్‌ ర్యాలీగా వెళ్లి దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెన్నె సన్యాసినాయుడు, నాయకులు టి. కిరణ్‌ కుమార్‌, మహేశ్వరావు, కె విమలారాణి, నాగులపల్లి నారాయణ రావు, పిల్ల అప్పలనాయుడు, సంచాన సన్యాసి నాయుడు, దుర్గాసి కోటేశ్వరరావు, పాల్గొన్నారు.
గరివిడి : చంద్రబాబునాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపించారని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్ష శిబిరానికి జనసేన పార్టీ చీపురుపల్లి మండల అధ్యక్షుడు విసినిగిరి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, వెన్నె సన్యాసినాయుడు, చనమల మహేశ్వర రావు, తిరుమల రాజు కిరణ్‌ కుమార్‌ రాజు, పిళ్ళా అప్పలనాయుడు, సంచాన సన్యాసి నాయుడు, కనిమేరక కృష్ణ, దుర్గాసి కోటేశ్వరరావు, కిలారి సూర్యనారాయణ, కర్రోతు గోవింద, గొర్లే గోవింద, గుడాల రామకృష్ణ పాల్గొన్నారు. శృంగవరపుకోట: స్థానిక ఆకుల డిపో వద్ద టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, పట్టణంలోని ధార గంగమ్మ ఫంక్షన్‌ హాలు వద్ద నియోజకవర్గ ఇన్చార్జి కోళ్ల లలిత కుమారి నియోజకవర్గ టిడిపి నాయకులతో వేరువేరుగా రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ఈ దీక్షలలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులతోపాటు పలువురు నాయకు లు పాల్గొని బాబుతో మేము సైతం అంటూ సంతకాలు చేసి సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరాలలో నియోజకవర్గం ఐదు మండలాల నుంచి టిడిపి నాయ కులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. బొబ్బిలి: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బొబ్బిలిలో టిడిపి చేపట్టిన నిరాహార దీక్షలకు సిపిఐ మద్దతు ప్రకటించింది. శ్రీఆంజనేయస్వామి ఆలయం వద్ద దీక్షను బేబినాయన ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ సందర్శించి మద్దతు తెలిపారు.విజయనగరంకోట: నగరంలో అశోక్‌ బంగ్లా వద్ద తెలుగు మహిళలు సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. శనివారం సాయంత్రంలో నగరంలో తెలుగు మహిళలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యదర్శి బంగారు బాబు, మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, తదితరులు పాల్గొన్నారు.