Sep 25,2023 23:07

ప్రజాశక్తి-గుడివాడ : చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం అంత చీకటి మయాంగా తయరైందని మాజీ ఎంపి మాంగటి వెంకటేశ్వరరావు(బాబు), మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావులు అన్నారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ నిరసనగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో 13వ రోజు రిలే నిరహరదీక్షలను తెలుగు మహిళాలుచే అధ్వర్యంలో నిర్వహించారు. దీక్షలు చేస్తున్న నాయకులకు పట్టణా, రూరల్‌, నందివాడ మండలల అధ్యక్షులు దింట్యాల రాంబాబు వాసే మురళీ, దానేటి సన్యాసిరావులు పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు సాయిన పుష్పవతి, యర్లగడ్డ సుధారాణి, గోర్ల శ్రీలకీë, మదాల సునీత, కొల్లి రమ్య, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు గోవాడ శివా పాల్గొన్నారు.