Sep 21,2023 21:26

గజపతినగరం.. చంపావతి నదిలో జలదీక్ష చేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి- గజపతినగరం :  చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి.
గజపతినగరంలో చంద్రబాబు అరెస్టులకు వ్యతిరేకంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో వినూత్నరీతిలో జలదీక్ష చేపట్టారు. గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామ సమీపంలో చంపావతి నదిలో నీటి దీక్ష చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొరుపోలు రమేష్‌, చప్ప చంద్రశేఖర్‌, మిత్తిరెడ్డి ఈశ్వరరావు, సర్పంచ్‌ రుంకాన అరుణ, లెంక చిన్నమ్నాయుడు, లెంక సత్యనారాయణ, బోని గోవింద, తదితరులు పాల్గొన్నారు,
బొబ్బిలి : టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం రాజకీయ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన అన్నారు. చంద్రబాబు అరెస్టుపై బొబ్బిలిలో తొమ్మిదో రోజు నిరసన దీక్ష కొనసాగింది. దీక్షను బేబినాయన ప్రారంభించారు. దీక్షలో మెట్టవలస గ్రామ తెలుగు మహిళలు పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన శుక్రవారం పాదయాత్ర చేపట్టనున్నారు. బొబ్బిలి నుంచి సింహాచలం వరకు చేపట్టే ఈ పాదయాత్ర పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రారంభం కానుంది. పాదయాత్రలో పాల్గొనేందుకు వందలాది మంది టిడిపి కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం విజయనగరంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ గజపతిరాజును కలిసి పాదయాత్ర గురించి వివరించారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
గరివిడి : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చీపురుపల్లిలో రిలే నిరాహారదీక్షలు గురువారం కొనసాగాయి. ఈ దీక్షలో తెలుగు యువత, టిడిపి నాయకులు దుర్గాసి కోటేశ్వరరావు, మీసాల కాశీ, చల్ల శ్రీరామ్‌, మంత్రి గోవింద, గంగుపల్లి జగదీష్‌, ముడిల రవణ, కర్రోతు పైడి నాయుడు, మీసాల శ్రీధర్‌, పనస రవి, నెమ్మాది శివ, వరపల శంకర్‌, సాలాపు వెంకటేష్‌, వెంపడాపు రామ్మూర్తినాయుడు, రౌతు కనక రాజు, పిన్నింటి వివేక్‌, చింత శివ తదితరులు పాల్గొన్నారు.