నాగబ్రహ్మాచారి, లక్ష్మణరావుకు నోటీసులు ఇస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్ ఉద్యోగుల జెఎసితో యాజమాన్యం తిరోగమని విధానంలో చేసుకున్న వేతన ఒప్పందాన్ని రద్దు చేసి, 45 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని, తదితర సమస్యలపై స్ట్రగుల్ కమిటీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కమిటీ నాయకులపై పోలీసుల బెదింపులు కొనసాగుతున్నాయి. చలో విజయవాడకు వెళ్లవద్దని జిల్లాలో బుధవారం కూడా నోటీసులు అందచేశారు. జిల్లా నాయకులు సిహెచ్.నాగబ్రహ్మాచారి, రాం ప్రభాకర్‌కు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు తదితరులకు పోలీసులు నోటీసులు అందించారు. ప్రభుత్వం తన నిర్బంధాన్ని ఆపాలని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.










