Jul 25,2023 22:28

నియామక పత్రాలను అందజేస్తున్న ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ జగదీశ్వరరావు

ప్రజాశక్తి - ఎచ్చెర్ల : స్థానిక ట్రిపుల్‌ ఐటిలో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ రెండో రోజు మంగళవారం కొనసాగింది. మొత్తం 1086 మందికి గానూ 900 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కౌన్సెలింగ్‌ కోసం 30 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, వంద మంది బోధన, బోధనేతర సిబ్బంది ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ పెద్దాడ జగదీశ్వరరావు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నారు. కార్యక్రమంలో ఒఎస్‌డి ఎల్‌.డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్‌ మోహన్‌కృష్ణ, కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ ఎస్‌.ఎస్‌వి. గోపాలరాజు, కౌన్సెలింగ్‌ కోఆర్డినేటర్‌ పి.గోవర్థనరావు ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ఆసిరినాయుడు, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.