
ఆలయం వద్ద క్యూలో ఉన్న యాత్రికులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పైడితల్లి అమ్మవారి దర్శనానికి బుధవారం కూడా భక్తులు తాకిడి కొనసాగింది. ఉదయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు. సిరిమాను సంబరం మంగళవారంతో ముగియడంతో దర్శనం కానీ భక్తులు, ఇతర ప్రాంతాలు నుంచి వచ్చిన వారు బుధవారం దర్శించుకున్నారు. మరోవైపు ఆలయం బయట సిరిమాను చెక్క కోసం భక్తులు ఎగబడ్డారు. సిరిమాను చెక్క ఇంటిలో ఉంచితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.