భోజనం వడ్డిస్తున్న వేగిశన నరేంద్ర వర్మ
ప్రజాశక్తి -బాపట్ల : టిడిపి బాపట్ల నియోజకవర్గ బాధ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పేదల ఆకలి తీరుస్తోంది.కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన ఏపూరి అంకయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రమేష్ సహకారంతో సోమవారం నిర్వహించిన అన్న క్యాంటీన్ 225వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా 350 మంది పేదలకు అన్న దానాన్ని నరేంద్ర వర్మ నిర్వహించారు . పేదల ఆకలి తీర్చే అద్భుతమైన అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములై తమ సహకారాన్ని అందిస్తున్న దాతలకు నరేంద్ర వర్మ ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాతలను నరేంద్ర వర్మ సన్మానించార










