ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో జరుగనున్న సిఎం పర్యటనను ప్రజలంతా బహిష్కరించాలని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండోరోజు రిలే నిరాహారదీక్షను టిడిపి జిల్లా కార్యాలయం అశోక్‌బంగ్లా వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీప్రసాద్ మాట్లాడారు. చంద్రబాబు విడుదలైన వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు. ప్రశాంతంగా ఆందోళనలు చేస్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మెడికల్ కళాశాల ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రిని పక్కనే ఉన్న ద్వారంపూడి, గుంకలాం,కొండకరకాం దగ్గర ప్రజలు అడ్డుకుంటారని తెలిపారు. కారిక్రమంలో నగర కార్యదర్శి బంగారు బాబు, టిడిపి మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు, విజ్జపు ప్రసాద్, శ్రీనివాసరావు,ఎ.ఎ.రాజు,కర్రోతు నర్సింగరావు, కంది మురళీ నాయుడు, కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి పట్టణంలో గురువారం తెలుగు మహిళలు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన ప్రారంభించారు. చంద్రబాబుకు బెయిల్ రావాలని పట్టణంలోని మసీదులో ముస్లిం పెద్దలతో కలిసి బేబినాయన ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో జాఫర్ పాల్గొన్నారు. శృంగవరపుకోట పట్టణంలోని ఆకులడిపో వద్ద టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, ధారగంగమ్మ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నిరాహార దీక్షలు చేపట్టారు. నెల్లిమర్ల పట్టణంలో రెండో రోజు టిడిపి దీక్షలు కొనసాగాయి. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర్‌రావు, మహంతి చిన్నం నాయుడు, సువ్వాడ వనజాక్షి, గేదెల రాజారావు, నాయకులు పోతల రాజప్పన్న, లెంక అప్పల నాయుడు, బైరెడ్డి లీలావతి, లెంక హైమవతి పాల్గొన్నారు. చీపురుపల్లి మండల కేంద్రంలో టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం కొనసాగాయి. గరివిడి మండలానికి చెందిన నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున 'బాబుతో నేను' కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండల నాయకులు పైల బలరాం, సారేపాక సురేష్ బాబు, ముల్లు రమణ, మహంతి రమణమూర్తి, మన్నేపూరి సూర్యనారాయణ, పిల్ల అప్పారావు, కుమిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.










