ప్రజాశక్తి-యంత్రాంగం
మాజీ సిఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం కొనసాగాయి.
కాకినాడ రూరల్ చంద్రబాబును జైలుకు పంపి 29 రోజులు అవుతున్న స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతిపై సిఐడి కోర్టుకు ఒక్క ఆధారం చూపలేకపోయిందని కేవలం రాజకీయ కక్షతో వ్యవస్థల్ని మేనేజ్ చేసి అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచుతున్నారని ఇది దుర్మార్గపు చర్య అని కాకినాడ రూరల్ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఆయన విడుదలను కాంక్షిస్తూ కాకినాడ రూరల్ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వలసపాకల సెంటర్ లో మహిళలతో రిలే నిరాహరదీక్ష నిర్వహించారు. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు కట్టెల పొయ్యి పై వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిక సమితి కన్వీనర్, కాకినాడ రూరల్ నియోజక వర్గ పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.సామర్లకోట రూరల్ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ సామర్లకోట మండలం అచ్చంపేట నుంచి పెద్దాపురం మండలం తొలి తిరుపతి కు పాదయాత్ర ను శనివారం చేపట్టారు. ఈ పాద యాత్ర కు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, అనపర్తి, పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎలు నల్లమిల్లి రామకష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ వర్మ లు సంఘీభావంగా మద్దతును తెలియజేశారు. కార్యక్రమం లో పెద్దాపురం నియోజకవర్గ టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. కాకినాడ టిడిపి జాతీయ కార్యదర్సి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు కాంతి తో క్రాంతి 7గంటల నుండి 7 గంటల 5 మిషాల వరకు చంద్రబాబుకు మద్దతుగా మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో ఇళ్లలో లైట్స్ ఆపుకొని కొవ్వత్తులు, ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తు, రోడ్డుపై నిరసన తెలియజేశారు. పార్టీ నాయకులు చల్ల పార్వతీ, పాలిక సత్య, నక్క జ్యోతి, రేలంగి లక్ష్మి, కనకం,దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరాంబ పాల్గొన్నారు. కరప నారా లోకేష్ పిలుపుమేరకు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం రాత్రి మండలంలో లైట్లు ఆపి కొవ్వొత్తులు కాగడాలు సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో మండలంలోని టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, కాకినాడ పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










