ప్రజాశక్తి-యంత్రాంగం
టిడిపి అధినేత, మాజీ సిఎం నారా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీశ్రేణులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి.
అమలాపురం చంద్రబాబుకు మద్దతుగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగహం వద్ద జరుగు సామూహిక నిరాహారక దీక్ష శిబిరం ఏర్పాటుచేశారు నియోజకవర్గం లో అమలాపురం అసెంబ్లీ ఇన్చార్జ్ ఆనందరావు అధ్యక్షతన అల్లవరం మండల అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో క్షత్రియ సంఘం వారు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో వేగిరాజు వెంకటరాజు, పిన్నమరాజు గాంధీ రాజు, గుంటూరి బాల, కలిదిండి వెంకటేశ్వరరాజు, గుంటూరి శ్రీనివాసరాజు, నడింపల్లి సుబ్బరాజు, పొత్తూరి రంగరాజు, గుంటూరి రఘురాజు, నడింపల్లి సుబ్బరాజు, అల్లూరి శ్రీనివాసరాజు, పెనుమత్స సుబ్రహ్మణ్యం రాజు, ముదునూరి వాసు రాజు, పెనుమత్స కష్ణంరాజు తదితరు పాల్గొన్నారు. మండపేట చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన తలపెట్టిన రిలే నిరహార దీక్షలు గురువారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయిందన్నారు. ఎక్కడ చూసిన రాష్ట్రంలో అరాచకాలు, అవినీతి, దౌర్జన్యం దోపిడీలు, నిత్య కత్యాలుగా మారాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, షేక్ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మండపేటలో టిడిపి నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ గురువారం సాయంత్రం చేపట్టారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి టౌన్ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










