ప్రజాశక్తి - నెల్లిమర్ల : నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో టిడిపి ఇంచార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు పద్మశాలీలు బుధవారం మద్దతు ప్రకటించారు. పద్మశాలి సాధికార సమితి జిల్లా కన్వీనర్ వానపల్లి వీరభద్రరావు, కొండపల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు సువ్వాడ రవి శేఖర్, డెంకాడ మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, భోగాపురం మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, పార్లమెంట్ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, నాయకులు లెంక అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: స్థానిక ఆకుల డిపో వద్ద 14వ రోజు రిలే నిరాహారదీక్షలో తప్పెట గుళ్ళు కళాకారులు, జామి మండల టిడిపి అధ్యక్షుడు లగుడు రవికుమార్ సంఘీభావం తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నాయకులు రాయవరపు చంద్రశేఖర్, ఎం.మంగరాజు, రెడ్డి పైడిబాబు, బండారు పెదబాబు, ఇప్పాక త్రివేణి, వర్మ రాజు, గేదల సతీష్, జురెడ్డి వెంకటరావు, లగుడు అప్పలనాయుడు, గుంటూరు శివ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అరెస్టును ఖండించిన మహిళలు
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. బుధవారం పట్టణంలోని దారగంగమ్మ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గంలోని 350 మంది టిడిపి మహిళలు, నాయకులు, కార్యకర్తలు సంతకాలు చేసి, చంద్రబాబు మద్దతుగా బాబుతో నేను సైతం అంటూ నల్ల బెలూన్లు, ప్లకార్డులు చేతపట్టుకొని, నల్ల బ్యాడ్జీలు, కండువాలు ధరించి, వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, వేపాడ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేడు మండల కేంద్రంలో దీక్షలు
బాడంగి: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండల కేంద్రంలో గురువారం దీక్షలు చేపడతామని టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దీక్షకి నియోజకవర్గం ఇంచార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు హాజరవుతారని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. రాజాం : మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, మీ పని ఐపోయింది తట్టా - బుట్టా సర్దేసుకోండి అంటూ వైసిపి ప్రభుత్వం పై టిడిపి రాజాం టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి శాసపు రమేష్ కుమార్ విరుచుకుపడ్డారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తన పిల్ల చేష్టలతో చంద్రబాబుని జైల్లో ఉంచినంత మాత్రాన టిడిపి నాయకులు నైరాశ్యంలోకి వెళ్ళిపోరని, గోడకి కొట్టిన బంతిలా మరింత విశ్వాసంతో ముందుకు వెళతారని చెప్పారు. జగన్మోహనరెడ్డికి ఇవే చివరి ఎన్నికలని, ఆ పార్టీలోని నాయకులు త్వరలో కనుమరుగయిపోక తప్పదని జోస్యం పలికారు. రామభద్రపురం: స్థానిక పార్టీ కార్యాలయం ఎదురుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. ఈ దీక్షలకు టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ రవ్వ ఈశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షులు కరణం విజయ భాస్కరరావు, చింతల చిన్నమ్మ తల్లి, వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు. భోగాపురం: చంద్రబాబు అరెస్ట్ అక్రమమని కరపత్రాల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యన్నారాయణ అన్నారు. పోలిపల్లి గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలతోపాటు వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అందుకు మీ గ్రామాల్లో ఈ కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో క్లస్టర్ ఇంచార్జిలు పిడుగు తోటరావు, దాసరి అప్పలస్వామి, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కర్రోతు రాజు, నాయకులు బొడ్డ హరిబాబు, లోకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం కోట: నగరంలోని ఒక హోటల్లో బుధవారం టిడిపి నాయకులు గణపతినీడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 'న్యాయం కోసం నారీగళం' కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మీ మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లోనూ స్థానం కల్పించిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో ఐటిడిపి విజయనగరం పార్లమెంటరీ విభాగం అధ్యక్షులు విమలారాణి, 49వ డివిజన్ కార్పొరేటర్ కర్రోతు రాధామణి, రాష్ట్ర మహిళా కమిటీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రెడ్డిపల్లి ఉషారాణి, తెలుగు మహిళా విభాగం రాష్ట్ర మహిళా కార్యదర్శి పత్తిగిల్లి సూర్యకుమారి, జనసేన ఉత్తరాంధ్ర మహిళా కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్యం, చిల్లపద్మ, కొర్నాన రాజ్యలక్ష్మి, సుహాసిని, ఆరతి సాహు, కిలాన పార్వతి, ఇందుకూరు లక్ష్మీ, జనసేన నాయకులు మాతా గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా బొబ్బిలిలో టిడిపి చేపట్టిన రిలే నిరహదీక్షలు కొనసాగుతున్నాయి. 15వ రోజు బుధవారం దీక్షలను నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన ప్రారంభించారు. చంద్రబాబుపై అక్రమ కేసులను ఎత్తి వేయాలని బేబినాయన డిమాండ్ చేశారు. దీక్షలలో పెంట, రంగరాయపురం, చెల్లారపువలస టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










