Oct 01,2023 23:58

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా ఆదివారం పలుచోట్ల నిరసన దీక్షలు కొనసాగాయి. కాకినాడ కార్పొరేషన్‌ కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, మాజీ ఎంఎల్‌సి చిక్కాల రామచంద్రరావు బాలాజీ చెరువు సెంటర్‌లో రిలే దీక్షలన ప్రారంభించారు. పిర్ల లక్ష్మీ ప్రసన్న, చొక్కా గిరి, బొడ్డు శివాజీ, గొరుసు దుర్గారావు, చింతపల్లి తాతారావు, అంగాడి దుర్గారావు, సీకోటి సింగ్‌, తాడి శ్రీను, అరదాడి శివ, వాసిరెడ్డి చిట్టిబాబు, కామాడి సుబ్బారావు, బలసాడి శ్రీను, బత్తుల ఉమాదేవి, గంటి కుసుమ కుమారి, వాసిపిల్లి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ మండలంలోని పెదబ్రహ్మదేవంలో తోటకూర శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళనలో నిమ్మకాయల రంగనాగ్‌, పాలకుర్తి శ్రీను బాబు, గుమ్మళ్ల రామకృష్ణ, ఆకునూరి సత్తిబాబు, మార్ని భద్రం, కంటిపూడి అయ్యన్న ప్రసాద్‌. మామిడాల రామకృష్ణ, లొల్ల శ్రీను, దడాల నాగరాజు, కొత్తెం కోటి, బడుగు శ్రీకాంత్‌, రంధి సత్యనారాయణ, తూతిక రాజు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ వలసపాకల సెంటర్‌లో దీఓలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిలి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి పాల్గొన్నారు. ఈ రిలే నిరాహారదీక్షకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు.