
ప్రజాశక్తి - ఆచంట
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆచంటలో టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ దీక్షలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్ బాబు, నేతలు కేతా మీరయ్య, గణపతి నీడి రాంబాబు, కొండేటి వీరాస్వామి, వెంకటరమణ పాల్గొన్నారు.
పాలకొల్లు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టిడిపి దీక్షలు 7వ రోజుకు చేరాయి. దీక్షల్లో తెలుగు యువత నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో ఛాంబర్ కళాశాల కరస్పాండెంట్ కలిదిండి రామరాజు పాల్గొన్నారు.
మొగల్తూరు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ముత్యాలపల్లిలోని గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కార్యక్రమాల్లో కొల్లాటి బాలకృష్ణ, అడ్డాల ఏడుకొండలు, దొంగ సత్య నారాయణ, శ్రీను, నాగిడి రాంబాబు పాల్గొన్నారు.
భీమవరం రూరల్ : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజు కొనసాగాయి. నియోజకవర్గంలోని ఎస్‌సి, ముస్లిం మైనార్టీ, ఎస్‌టి, మహిళా నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొనగా రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, కృష్ణబలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తులు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్ బాబు వారికి మాలలు వేసి దీక్ష ప్రారంభించారు. టిడిపి సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ కందికట్ల జోషి మాట్లాడారు. దీక్షలో ఎస్‌సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు ఏసుపాదం, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యళ్ల వెంకటేశ్వరరావు, అనపర్తి కృష్ణప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.