Sep 13,2023 22:55

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాకినాడ చంద్రబాబు అరెస్టు విధానం అప్రస్వామికంగా ఉందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల చెరువు కాస్మో పాలిటిన్‌ క్లబ్‌లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మాజీ ఎంఎల్‌ఎ వనమాడి వెంకటేశ్వరరావు, పిసిసి సభ్యుడు ఆకుల వెంకటరమణ, సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, నాయకులు దువ్వా శేష బాబ్జి, ఆర్‌పిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, జై భారత్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు కృష్ణమూర్తి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, మాకిరెడ్డి గణేష్‌ బాబు, చొల్లంగి వేణుగోపాల్‌, పప్పు దుర్గా రమేష్‌, కె.బోడకొండ, పి.సత్యనారాయణ, టిడిపి నగర అధ్యక్షులు వీరు, తుమ్మలపల్లి రమేష్‌, జనసేన నాయకులు సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు తాళ్లూరి రాజు, పిఎస్‌ నారాయణ, పప్పు ఆదినారాయణ, గదుల సాయిబాబా, పనీశ్వరావు మాట్లాడారు. టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేపట్టి బాబుతో నేను నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్చార్జ్‌ వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. రౌతులపూడి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్య ప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలకు మండల వ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. తమరాల సత్యనారాయణ, పసగడుగుల రమణ, సోమరౌతు రవి ఉన్నారు. గండేపల్లి ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద పోతుల మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షల్లో మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. కోర్పు లచ్చయ్య దొర, ఎల్మటి కాశి, పాలకుర్తి ఆదినారాయణ, వెంపాటి రాజు, పాలచర్ల సత్యనారాయణ, ఇప్పర్ల సురేష్‌, వెంపాటి సతీష్‌, చిటికెళ కన్నబాబు, పైని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయం ఎదురుగా దీక్షలు చేపట్టారు. రాజా సూరిబాబు రాజు, కొత్తిం వెంకట శ్రీనివాసరావు, రంది సత్యనారాయణ, తూతిక రాజు, ఎలిశెట్టి నాని, కందుల విశ్వేశ్వరరావు, మొయిళ్ల కృష్ణమూర్తి, మన్యం దేవబాబు, చాగంటి గోపాలకృష్ణ, మేడిది శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కరప గొర్రిపూడిలో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణ దీక్షలను ప్రారంభించారు. గండి వెంకటేశ్వరరావు, జల్దాని ఏసుబాబు, సూర్యనారాయణ, సుకుమార్‌, మహేష్‌, ఇమ్మాన్యుయేల్‌, యనమదల వెంకటలక్ష్మి, ఆట్ల గోవిందు, విష్ణు, జి.శ్రీనివాసరావు, కంటే సత్తిబాబు, ఉషారాణి, బొజ్జ భవాని పాల్గొన్నారు. పెదపూడి మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్‌టిఆర్‌. విగ్రహం వద్ద శిబిరాన్ని ప్రారంభించారు. పుట్టా గంగాధరచౌదరి, ఆరుమిల్లి అమ్మన్న చౌదరి, జుత్తుక సూర్యకుమారి, సత్యవతి, జుత్తుక కృష్ణ, పైణ్ణి బాబు,కొటికలపూడి సత్తిబాబు, చిర్రా వరప్రసాద్‌, తమలంపూడి శివరామారెడ్డి పాల్గొన్నారు.