Oct 05,2023 23:28

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా టిడిపి దీక్షలు, నిరసనలు గురువారం కొనసాగాయి. కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యాన 22వ రోజు కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్‌ లారీ యూనియన్‌, వినాయక డీప్‌ వాటర్‌ పోర్ట్‌, అల్యూమినియం వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గదుల సాయిబాబా, పినపోతు రాంబాబు, కామాడి సుబ్బారావు, ఓలేటి పాండురంగడు పాల్గొన్నారు. కాకినాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని మాట్లాడారు. చంద్రబాబుని జైల్లో పెట్టలేదని అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రమే జైల్లో బంధించారన్నారు. ఈ సమావేశంలో చల్లా పార్వతి, గండేపల్లి దేవి, పాలిక సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ వలసపాకలలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మట్టా ప్రకాష్‌ గౌడ్‌, కర్రి వెంకటరాజు, బోళ్ల కృష్ణమోహన్‌, దాయన రామ్‌ప్రసాద్‌, తాతపూడి రామకృష్ణ, మిరపల ప్రకాష్‌ నాయకులు కాళ్ల శ్రీను, గుబ్బల సత్తిబాబు, వాసంశెట్టి రాంబాబు, పడమటి వీరబాబు, వాసంశెట్టి సత్యనారాయణ, చల్మాజీ, కేశబోయిన ఏడుకొండలు, పెసంగి వర్మ, గరికిన పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు తాటిపాకలో టిడిపి, జనసేన సంయుక్తంగా దీక్ష చేపట్టాయి. టిడిపి తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల దివ్య, యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో బాబుతో నేను సంతకాల సేకరణను ప్రారంభించారు. అనంతరం జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. తుని నర్సీపట్నం రహదారిపై రాష్ట్ర రాస్తారోకో నిర్వహించారు. బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాడి రాజబాబు, పోల్నాటి శేషగిరిరావు, మోతుకూరి వెంకటేష్‌, అంకంరెడ్డి రమేష్‌, లెక్కల భాస్కర్‌ రావు, పోతల సూరిబాబు, భీమిరెడ్డి అప్పలనాయుడు, పెనుమచ్చ నాగేశ్వరరావు, బైలపూడి శ్రీరామ్మూర్తి, ఎం.బాపిరాజు, బోడపాటి సత్యనారాయణ, గంటా అమ్మాజీ పాల్గొన్నారు. పెద్దాపురం టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి పట్టణ అధ్యక్షులు రంది సత్యనారాయణ, కార్యదర్శి తూతిక రాజు, ఎలిశెట్టి నాని, కొరుపూరి రాజు, నూనె రామారావు, చాగంటి గోపాలకృష్ణ, దివానం, వెంకటేష్‌, వెంకన్న, అరవింద కుమార్‌, బొడ్డు ఉదరు పాల్గొన్నారు.