Sep 27,2023 21:17

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
చంద్రబాబుపై అక్రమ కేసులు నిరసిస్తూ భీమవరం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో బుధవారం తెలుగు యువత నియోజకవర్గ నాయకులు పాల్గొని అర్ధనగ ప్రదర్శన చేపట్టారు. నిరాహార దీక్షా శిబిరం వద్ద టిడిపి నాయకుడు షేక్‌వలీ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతోషం వ్యక్తం చేశారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్‌, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపల్లి వెంకట్‌, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల నాగబాబు మాట్లాడారు. నిరాహార దీక్షలో నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కాసాని రామాంజనేయులు, మండల అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి, ఉపాధ్యక్షుడు వీరమల్లు వెంకట్‌ పాల్గొన్నారు.
ఆచంట : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు పితాని వెంకట్‌ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15వ రోజు బుధవారం కొనసాగాయి. ముందుగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి, అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి మాట్లాడుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కేతా మీరయ్య, నాయకులు గొడవర్తి శ్రీరాములు, బలుసు శ్రీరామ్మూర్తి, నెక్కంటి ప్రభాకర్‌, కేతా మురళి, బాలాజీ, చిలుకూరి సీతారాం బీరా నరసింహమూర్తి. సుధాకర్‌ పాల్గొన్నారు.
పోడూరు : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మండల ఎస్‌సి సెల్‌ అధ్వర్యంలో బుధవారం తహశీల్దార్‌ ఆర్‌వి కృష్ణారావు, ఆర్‌ఐ కందుల రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌సి సెల్‌ ఉపాధ్యక్షులు కొండేటి చల్లారావు, మండల ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు ఎల్లమెల్లి వెంకటరావు, నామవరపు రవికుమార్‌, ఉండ్రు లింగ మూర్తి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్‌.రాజు పిలుపుమేరకు ఎస్‌సి కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు ముప్పిడి రమేష్‌ ఆధ్వర్యంలో ఎస్‌సి నాయకులు తహశీల్దార్‌ వై.దుర్గా కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీతల సత్యనారాయణ, శీలి వెంకటాచలం, మెరుపో సంతోషరావు, చీకట్ల శాంసన్‌, గరపాక మూర్తి పాల్గొన్నారు.
ఉండి : ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలు చంద్రబాబు వైపే ఉంటారని టిడిపి ఎస్‌సి సెల్‌ నాయకులు గొల్ల జాన్‌ కెనడీ, విక్టర్‌ బాబు, ఎస్‌టి సెల్‌ జిల్లా అధ్యక్షులు సాలా మల్లేశ్వరరావు, మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ మూసానాయన అన్నారు. టిడిపి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి మైనార్టీ సభ్యులు చంద్రబాబుకు మద్దతుగా కళ్లకు గంతలు కట్టుకుని దీక్షను కొనసాగించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.
ఆకివీడు : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇంటింటికీ వెళ్లి టిడిపి నేతలు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు మోటుపల్లి రామ్‌ వరప్రసాద్‌, కోట్ల రామారావు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి సెల్‌ ఫోన్లు టార్చ్‌ లైట్లతో పట్టణంలో పాత బస్టాండ్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి మండల అధ్యక్షులు మోటిపల్లి రాం వరప్రసాద్‌ నాయకత్వం వహించారు.