ప్రజాశక్తి-యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు బుధవారం కొనసాగాయి. కాకినాడ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపినట్టు టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తెలిపారు. కాకినాడ రూరల్ వలసపాకలలో దీక్షలో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. కర్రి వెంకట్రాజు, మట్టా ప్రకాష్ గౌడ్, బుంగా సింహాద్రి, బోళ్ల కృష్ణమోహన్, తాతపూడి రామకృష్ణ, సర్దేనాగ హరినాథ్ పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ 7వ రోజు రిలే దీక్షలో మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, నాగీడి నాగేశ్వరరావు, మల్లిపూడి వీరు, గుజ్జు బాబు, నల్లూరి శ్రీనివాస్, కేలంగి ప్రసాద్, చిట్నీడి దార, గుర్రాల శ్రీనివాస్, బొంతు సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నరు. పెద్దాపురం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నిమ్మకాయల రంగనాగ్, కొత్తిం వెంకట శ్రీనివాసరావు, రంధి సత్యనారాయణ, ఎలిశెట్టి నాని, తూతిక రాజు, కొరుపూరు రాజు, చాగంటి గోపాలకష్ణ, అరవింద కుమార్, మొయిళ్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు. తుని యనమల కృష్ణుడు, వనపర్తి బద్రి ఆధ్వర్యాన సంతకాలు సేకరించరాఉ. యనమల శివరామకృష్ణన్, సుర్ల లోవరాజు, చొక్కా అప్పారావు, పేకేటి హరికృష్ణ, కొడా వెంకటరమణ, కొయ్యా కేశవ్, మళ్ల గణేష్ పాల్గొన్నారు.










