Sep 17,2023 23:11

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు ఆదివారం కొనసాగాయి. కాకినాడ రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జెడ్‌ బ్రిడ్జి సెంటర్‌ నుండి ఇంద్రపాలెం గ్రామం వీధుల్లో కాగడాలతో ర్యాలీ చేపట్టారు. మందలపు రవి, కటకంశెట్టి ప్రభాకర్‌, మాకినీడి భాస్కర్‌, చొల్లంగి వేణుగోపాల్‌, సరిదే నాగ హరినాథ్‌, దాయన రాంప్రసాద్‌, కర్రి వెంకటరాజు పాల్గొన్నారు. ఏలేశ్వరం తెలంగాణ విడిపోయి రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిన సమయంలో ఎపి భవిష్యత్తు కోసం చంద్రబాబు పరితపించారని టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ అన్నారు. ఏలేశ్వ రంలో ప్రత్తిపాడు నియోజక వర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్య ప్రభతో కలిసి నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, పెండ్ర శ్రీను, కోణాల వెంకటరమణ, ఎండగుండి నాగబాబు, నాయకులు జ్యోతుల పెదబాబు, సూది బూరయ్య, పతివాడ కృష్ణ, కోరాడ కృష్ణమోహన్‌, కిలారి రామచంద్రరావు, బెల్లాని శ్రీను, వైబోగుల సుబ్బారావు ఉన్నారు. కరప మాజీ జెడ్‌పిటిసి నులుకుర్తి వెంకటేశ్వరరావు, పేరాబత్తుల రాజశేఖర్‌ స్వర్ణ థియేటర్‌ వద్ద సామూహిక నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షల్లో వాసిరెడ్డి ఏసుదాసు, దేవు వెంకన్న, కొండ వినాయక్‌, కంచుమర్తి లావణ్య, ఆనంద చౌదరి, పి.లోవరాజు, భవాని, వెంకటరత్నం చౌదరి, జి.భాస్కరరావు, కె.ధర్మారావు పాల్గొన్నారు. పెద్దాపురం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజా సూరిబాబు రాజు, రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కొత్తిం వెంకట శ్రీనివాసరావు, కురుపూరి రాజు, కాకినాడ రామారావు, చాగంటి గోపాలకృష్ణ, బొడ్డు ఉదరు, నూనె రామారావు, ఎలిశెట్టి నాని, కందుల విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ హుస్సేన్‌పురంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. చల్లా బుజ్జి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది పోస్టు చేయనున్నట్లు వారు చెప్పారు. పుప్పాల రాజు, కోట సురేష్‌ కుమార్‌, కె.శ్రీను, పుప్పాల రామచంద్రరావు, పలివెల చంద్రశేఖర్‌, పైణ్ణి లక్ష్మణరావు, బుంగా బాలరాజు, వాకపల్లి లోవరాజు, తలారి శ్రీను, పుప్పాల శివ, కలవల చంద్రరావు, మల్లిపూడి వీర్రాజు, గుడాల గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.