ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం నిరసనలు కొనసాగించారు. కాకినాడ మాజీ మేయర్, టిడిపి మహిళా జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో తెలుగు మహిళలు గాంధీ నగర్ సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నల్ల జెండాలతో నిరసన తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా బాబు తో నేను అని ప్రజలతో సంతకాలు సేకరించారు. కాకినాడ కార్పొరేషన్ కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు జగన్నాథపురం ఆజామ్ మసీదులో మైనార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఆన్సర్, రహీమ్, ఖాన్, తాజద్దీన్, బాబులు, సయెద్, సయ్యద్ అలీ, అన్వర్, జోరుల్లా ఖాన్, కరీముల్లా, కస్మూర్, ఖాదర్ వలీ ఖాన్, జమీల్, మన్సూర్, ఇమామ్ సాహెబ్, సయ్యద్ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి వలసపాకల సెంటర్‌లో రెండో రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. 93 బిసి కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం రమణయ్యపేటలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి కో ఆప్షన్ సభ్యుడు మట్టా ప్రకాష్ గౌడ్, చుండ్రు వెంకన్నరావు, క్లస్టర్ ఇన్‌ఛార్జీలు తాతపూడి రామకృష్ణ, సరిదే నాగ హరినాథ్, మిరపల సూర్య ప్రకాష్, దాయిన రామ్‌ప్రసాద్, నాయకులు పేరాబత్తుల లోవబాబు, కోటగిరి మహేంద్ర బాబు, పడమటి వీరబాబు, బాదం వరలక్ష్మి, పాలిక ఉషారాణి, పలివెల త్రిమూర్తులు గాయత్రి, ఎలగా లోవరాజు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ టిడిపి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో పిఠాపురం రోడ్డులో ఉన్న మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, బలుసు వాసు, హబీబుల్లా, ఎండి సైపుల్లా, ఎస్.రెహమాన్, తాతపూడి కృష్ణబాబు, అందుగుల జార్జి చక్రవర్తి, వల్లూరి దొర, గొల్లపల్లి కామరాజు, కాళ్ల రవీంద్రబాబు, గొల్తి సత్యనారాయణ, ప్రసాదుల రాధాకృష్ణ, బన్న బాబు, పాల్గొన్నారు వేట్లపాలెంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ప్రసంగించారు. కాకినాడ రామారావు, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు చౌదరి, కంటే మెహన్ జగదీష్ బాబు, గుమ్మళ్ల రామకృష్ణ, తోటకూర శ్రీనివాస్, ఎలిశెట్టి నాని, నిమ్మకాయల రంగనాగ్, కుర్రా నారాయణ స్వామి పాల్గొన్నారు. ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో రెండవ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. నాయకులు జ్యోతుల పెదబాబు, బొదిరెడ్డి గోపి, సూతి బూరయ్య, మూది నారాయణస్వామి, బస ప్రసాద్, మైరాల కనకారావు మహిళలు ఉన్నారు.










