ప్రజాశక్తి -యంత్రాంగం మాజీ సిఎం చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా టిడిపి శ్రేణులో గురువారం ఆందోళనలు కొనసాగించారు. కాకినాడ కార్పొరేషన్ మాజీ మంత్రి కెఎస్.జవహర్, మాజీ ఎంఎల్‌ఎ వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్‌లో దీక్షలు చేపట్టారు. నాగీడి నాగేశ్వరరావు, మాకిరెడ్డి భాస్కర్ గణేష్, పిట్టా వరప్రసాద్, మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, నరం శ్రీనివాసరావు, మల్లిపూడి నాగ దీపిక, చిక్కాల సత్యవతి, తుమ్మల సునీత, బంగారు సూర్యావతి, గుజ్జు దుర్గ, అంబటి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం దివిలి గ్రామంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, కొత్తిం వెంకట శ్రీనివాసరావు, ఎలిశెట్టి నాని, కందుల విశ్వేశ్వరరావు, మొయిళ్ల కృష్ణమూర్తి, రేలంగి బుజ్జి, ఇంధన జయకృష్ణ పాల్గొన్నారు. ఏలేశ్వరం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ సెంటర్లో మానవహారం చేపట్టారు. అనంతరం రిలే దీక్షలను సత్యప్రభ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, కోణాల వెంకటరమణ, యండగుండి నాగబాబు, నాయకులు జ్యోతుల పెదబాబు, సూది బూరయ్య, బొరుసు శ్రీనివాసచక్రవర్తి, మండపాక అలక్ రాజు, పలివెల శ్రీను, భజంతుల మణి పాల్గొన్నారు. రౌతులపూడి రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల సత్యప్రభ పాల్గొని మాట్లాడారు. తమరాల సత్యనారాయణ, పైల సాంబశివరావు, సోమరౌతు రవి, యామల సురేష్, సింహాద్రి పెదబాబు పాల్గొన్నారు. అన్నవరం బస్సు కాంప్లెక్స్ వద్ద మెరపల నరసయ్య ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఇన్‌ఛార్జి వరపుల సత్య ప్రభ, నాయకులు పాల్గొన్నారు. తొండంగి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల దివ్య, యనమల కృష్ణుడు ఒంటిమామిడిలో దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. పోల్నాటి శేషగిరిరావు, మోతుకూరి వెంకటేష్, యనమల శివరామకృష్ణ, గాడి రాజబాబు, చింతంనీడి అబ్బాయి, మురాలశెట్టి సత్యనారాయణ, పేకేటి హరిబాబు, చొక్కా కాశీ, చొక్కా అప్పారావు, సిద్దా రాంబాబు, కోడా రమణ కొయ్యా కేశవ్ లెక్కల భాస్కరరావు పాల్గొన్నారు.










