ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని మోదవలస, బంగార్రాజుపేట, కొండ్రాజుపేట గ్రామాల టిడిపి నాయకులు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు పల్లె భాస్కర్ రావు, నాయకులు కలిదిండి పాణీరాజు, పతివాడ శివరామ విద్య సాగర్‌నాయుడు, కాగితాల సత్యనారాయణ రెడ్డి, కొర్నాన ఆదిబాబు, పడాల చిన్నారావు, సరగడ లక్ష్మి, కలిదిండి రంగరాజు, చిల్ల పద్మ, ముని పైడయ్య, ఎర్నింటి రాము, ఎర్నింటి శ్రీను తదితర పాల్గొన్నారు.
నెల్లిమర్ల: నగర పంచాయతీ 6వ వార్డుకు చెందిన టిడిపి నాయకులు మండల కేంద్రంలో గురువారం రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి నియోజకవర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, పార్లమెంట్ పార్టీ కార్యదర్శి లెంక అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు సువ్వాడ రవి శేఖర్, సువ్వాడ వనజాక్షి, భోగాపురం, నెల్లిమర్ల టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, కడగల ఆనంద్ కుమార్, అధికార ప్రతినిధి గేదెల రాజారావు, లెంక హైమావతి తదితరులు పాల్గొన్నారు.
బాడంగి : సైకో సిఎం జగన్‌కి రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయడు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన కోరారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా గురువారం బాడంగిలో నిరాహార దీక్ష చేపట్టారు. టిడిపి అభిమాని వై.స్వామినాయుడు అరగుండు కొట్టించుకొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, ఎస్‌టి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస గౌరు, వైస్ ఎంపిపి ఎస్.భాస్కరరావు, చింతల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బొబ్బిలిలో 16వ రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. దీక్షలను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన ప్రారంభించారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు రౌతు రామమూర్తి, ఎస్.సాయిరమేష్, తెలుగు రైతు నాయకులు కె.అప్పలనాయుడు పాల్గొన్నారు.
రామభద్రపురం : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యాన సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు కనిమెరక వెంకటి, పూడి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: చంద్రబాబు అక్రమ అరెస్టు పై టిడిపి నాయకులు గురువారం ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు.టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ప్రతి ఇంటికి తిరిగి బాబు అక్రమ అరెస్టును వైసిపి ప్రభుత్వం అన్యాయాన్ని అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, పార్లమెంట్ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, కొత్తపేట మాజీ సర్పంచ్ గురాన అసిరినాయుడు, మండల ప్రధాన కార్యదర్శి గురాన చక్రధర్, కలిశెట్టి సీతారాం తదితరులు పాల్గొన్నారు.










