Jul 11,2023 00:04
దీక్ష చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి-కోటవురట్ల:పాఠశాల, రోడ్డు నిర్మాణం చేపట్టాలని గొట్టువాడ శివారు అణుకు గిరిజనులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. తమ గ్రామానికి రహదారి, పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు, సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ, గిరిజన గ్రామమైన అణుకు గ్రామానికి కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రహదారి నిర్మాణాలకు స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు పాల్గొన్నారు.