
నినాదాలు చేస్తున్న గిరిజనులు
ప్రజాశక్తి-కోటవురట్ల:అణుకు గిరిజన గ్రామానికి పాఠశాల, రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న జిల్లా సిపిఎం నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ, గిరిజనులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.