Jul 09,2023 23:59

దీక్ష చేపడుతున్న నేతలు, గిరిజనులు

ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలో గొట్టువాడ శివారు అణుకు గ్రామానికి పాఠశాల, రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. సిపిఎం జిల్లా నాయకులు అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఆకులతో టోపీ ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి పాఠశాల, రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు, ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్షలు విరిమించేది లేదని ఈ సందర్భంగా గిరిజనులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు డేవిడ్‌ రాజు, అణుకు గిరిజనులు పాల్గొన్నారు.