నినాదాలు చేస్తున్న స్థానకులు
ప్రజాశక్తి-పాడేరు:మండలంలోని చింతలవీధి పంచాయతీలో వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయించడం చట్ట విరుద్ధమని, వెంటనే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వివాద స్థలంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగవ రోజు కొనసాగాయి. ఈ రిలే దీక్షలో పాల్గొన్న గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎల్ సుందర్‌రావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వెంటనే స్పందించి వైసిపి కార్యాలయ నిర్మాణ పనులను తక్షణమే నిలిపి చేయాలన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ దీర్ఘకాలంగా జీవనోపాధి పొందుతున్న గిరిజనులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ రిలే దీక్షలో నడింవీధి ఉబ్బేడి పుట్టు గ్రామస్తులు పాల్గొన్నారు.










