Apr 08,2023 23:41

ఆందోళన చేస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 491వ రోజుకు చేరింది. శనివారం శిబిరం వద్ద మత్స్యకారులు పైప్‌ లైన్‌ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ, పైపులైన్‌కు వ్యతిరేకంగా 490 రోజుల నుండి తామంతా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ,ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి మార్గం చూపక పోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా వేస్తున్న పైప్‌ లైన్‌కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల స్వామి, పిక్కి రమణ, వాసపల్లి నూకరాజు, బొంది నూకరాజు, పీక్కి కాశీ, మైలపల్లి నల్ల, పీక్కి సత్తిరాజు, చొడిపల్లి రాజు, వాసపల్లి వెంకటేష్‌, కారే కోదండరావు, పీక్కి శ్రీను, మైలపల్లి శివ, మైలపల్లి జాను, బైరాగి రాజు తదితరులు పాల్గొన్నారు.