Nov 17,2022 23:58

నినాదాలు చేస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్‌ పూర్తిగా తొలగిం చాలని మత్స్యకార నాయకులు డిమాండ్‌ చేశారు. పైప్‌ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా గురువారం నాటికి 353వ రోజుకు చేరింది. శిబిరం వద్ద మత్స్యకారులు పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.పైప్‌ లైన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిపిల్లి నూకరాజు, మత్స్యకార నాయకులు మైలపల్లి జాన్‌, పిక్కి గంగరాజు, మైలపల్లి బాబ్జి, మైలపల్లి శివాజీ, దైలపల్లి కాశీ, చొడిపిల్లి రాజు, మైలపల్లి అప్పలరాజు, రాజు పాల్గొన్నారు .