ప్రజాశక్తి-యంత్రాంగం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరాలు శనివారం కొనసాగాయి. వివరాలు ఇ వి..
అంబాజీపేట పేదల ముంగిటికే ఆరోగ్య సేవలందించాలన్న ప్రభుత్వం లక్ష్యమే జగనన్న ఆరోగ్య సురక్ష సేవలు అని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. గంగలకుర్రు సచివాలయం వద్ద సర్పంచ్ కాండ్రేగుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సురక్ష క్యాంప్‌ను ఎంఎల్‌ఎ సందర్శించారు. వైద్యాధికారులు కె.ఎస్.శ్రీనివాస్, జనరల్ స్పెషలిస్ట్ వైద్యులు, లాబ్ టెక్నీషియన్‌లు ప్రజల అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఎంపిడిఒ కె.సత్యనారాయణ మూర్తి, ఇఒపిఆర్‌డి బి.మమత, పంచాయతీ కార్యదర్శి సత్యవేణిలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, సొసైటీ ఛైర్‌పర్సన్ డి.సత్యమోహన్, పిహెచ్‌సి సిహెచ్‌ఒ.అప్పారావు వైద్య సిబ్బంది నాయకులు, పాల్గొన్నారు. ఆలమూరు రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సిఎం జగన్ జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపిడిఒ కె.జాన్ లింకన్, సర్పంచ్ తోట భవాని, ఎంపిటిసి తోలేటి సంతోషి అన్నారు. సందిపూడిలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారి అధ్వర్యంలో నిర్వహించారు. కిమ్స్ ప్రత్యేక వైద్య నిపుణులు ఈ.మౌలి, పి.ప్రసన్నలక్ష్మిలతో పాటు స్థానిక వైద్యాధికారులు పి.భవాని శంకర్, డి.సువర్చల, నేత్ర వైద్య నిపుణురాలు పి.శ్రీలక్ష్మి పాల్గొని 350 మంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి 105 రకాల మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ టి.ఎన్.వి.నాగలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు తయారుచేసిన 35 రకాల పౌష్టికాహారం వంటకాలను గ్రామ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.










