Oct 20,2023 23:54

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరాలు కొనసాగాయి.
మామిడికుదురు మామిడికుదురులో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఎంపిపి కుసుమ వనజకుమారి సందర్శించారు. సర్పంచ్‌ గౌస్‌ మొహిద్దిన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ఎంపిడిఒ కె.వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ రియాజ్‌ హుస్సేన్‌, పరిపాలనాధికారి కారుపల్లి వెంకటేశ్వరరావు, ఇఒపిఆర్‌డి అడబాల శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పిఎస్‌ విఎస్‌. ప్రసాద్‌, పిఎసిఎస్‌ ఛైర్‌పర్సన్‌ కటకంశెట్టి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. మండపేట ఇప్పనపాడులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. గ్రామ సర్పంచ్‌ కుంచే వీరమణి, ఎంపిటిసి సభ్యులతో కలిసి గర్భిణులకు సామూహిక శీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్వైజర్‌ సత్యవేణి, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, శానిటేషన్‌ సూపర్వైజర్‌ మగ్గం రాంబాబు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. ఆలమూరు పేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో దోహదపడుతుందని కొత్తపేటనియోజకవర్గ అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎం.సుమలత, ఎంపిడిఒ జాన్‌ లింకన్‌ అన్నారు. చెముడులంక గ్రామ సచివాయం-2 పరిధిలో సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. ఇఒపిఆర్‌డి రాజుకుమార్‌, డిటి జానకి రాఘవ కలిసి వారు పరిశీలించారు. అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య నిపుణులతో పాటుగా స్థానిక వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు. అంగన్‌వాడీలు ఏర్పాటు చేసిన పౌష్ఠికాహార వంటకాలు, పండ్లు, కాయగూరలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో వైసిపి నేతలు దొండపాటి చంటి, అడబాల వీర్రాజు, దొండపాటి వెంకటేశ్వరరావు, బి.వీర వెంకట్రావు, దొండపాటి శ్రీను, మోటూరి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం కాలేరు జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ దాయం కావేరి అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, ఎంపిటిసి సభ్యురాలు శ్రీ సత్య మంజు, ఎంపిడిఒ ఎం.రామకృష్ణారెడ్డి తదితరులు ,పాల్గొన్నారు. ఆత్రేయపురం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము ద్వారా గ్రామాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్‌పిటిసి సభ్యుడు బోనం సాయిబాబా, ఆప్కో డైరెక్టర్‌ కప్పల శ్రీధర్‌, ఎంపిడిఒ నాతి బుజ్జి అన్నారు. ర్యాలీ గ్రామంలో సర్పంచ్‌ లక్ష్మి అధ్యక్షతన డాక్టర్‌ ఎన్‌.సునీత పర్యవేక్షణలో వైద్య సేవలు అందించారు. ఉప్పలగుప్తం గోపవరం సచివాలయ పరిధిలో గోపవరం-సరిపల్లి గ్రామాల ప్రజలకు స్థానిక సర్పంచ్‌ కుంచే బుల్లియ్య ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు తదితరులు పాల్గొన్నారు.