మంగళగిరి: కొండవీటి వాగు ముంపు నివారణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు తూటుకాడ, గుర్రపుడెక్క యుద ్ధప్రాతి పదికన తొలగించాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. 20 గ్రామాలకు సంబంధించి సుమారు 20 వేల ఎకరాల పంట మునిగిపోయి రైతులు నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉండ వల్లి లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ కింద సాగయ్యే భూమిలో నేటికీ నాట్లు పడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంపు సెట్లు, పాడైపోయిన ఇంజన్లు బాగు చేయాలని కోరారు. ఉండ వల్లిలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్‌లోకి అపార్టుమెంట్ల నుంచి వచ్చే మురుగు కలవకుండా తగిన చర్యలు తీసు కోవాలని, ఆ ప్రాంత పంట పొలాలకు నష్టం కలగకుండా చూడాలని, చిర్రావూరులో పశువుల డాక్టర్‌ను నియమిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు, కొండవీటి వాగు ముంపు నివారణ కోకన్వీనర్ కె.ఈశ్వరరెడ్డి, దొంతిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు.
కమ్యూనిటీ హాల్ నిర్మించండి
నిడమర్రులోని ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, ఏఏ ప్రాథమిక పాఠశాలలో మెరక తోలాలని, కర్మకాండలకు షెడ్ నిర్మాణం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. మంగళగిరిలోని ఎమ్మెల్యే కార్యాల యంలో ఆయనను కలిశారు. ఎమ్మెల్యే స్పందించి డి ఇతో మాట్లాడి వెంటనే హాల్, షెడ్ నిర్మాణాలకు అంచ నాలు తయారు చేస్తానని చెప్పారు. అర్జీ అందజేసిన వారిలో సిఐట ియు నాయకులు ఎం.రవి, ఎం.భాగ్యరాజ్, స్థానిక పెద్దలు కె.నాగేశ్వరరావు, కె.వీరయ్య, కె.కళ్యాణ్, కె.అశోక్ ఉన్నారు.
మురుగు నివారణకు చర్యలు చేపట్టండి
తాడేపల్లి: తాడేపల్లి బైపాస్‌రోడ్డులోని విఆర్ అపార్టుమెంట్ వద్ద డ్రెయినేజీ వాటర్‌తో పాటు వర్షం నీరు రోడ్డుపై చేరి రాక పోకలకు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో స్థానిక అపార్టు మెంట్ వాసులు ఎస్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. దీనిపై స్పందించిన వారు మురుగు సమస్య పరిష్కారానికి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. ఇందుకు కావాల్సిన అంచనాలను తయారు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన వైసిపి పట్టణ అధ్యక్షులు బి.వేణుగోపాల సోమిరెడ్డికి అపార్టుమెంట్ వాసులు అభినందనలు తెలిపారు.










