Sep 29,2023 00:28

ప్రజాశక్తి - యడ్లపాడు : మండలంలోని కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం సందర్శించారు. ఉదయం ఏడు గంటలకు కొండవీటి నగరవనంలో మార్నింగ్‌ వాక్‌ చేసిన ఆయన కోటలోని పలు ప్రాంతాలను సందర్శించి మొక్కలు నాటారు. కోట విశేషాలను మ్యాప్‌ద్వారా కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కె.శివారెడ్డి వివరించారు. ఆయనవెంట రాష్ట్ర అటవీ దళపతి వై.మధుసూదన్‌రెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎల్‌.శివశంకర్‌, పల్నాడు జెసి ఎ.శ్యాంప్రసాద్‌, పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శ్రీనివాసరెడ్డి, డిఎఫ్‌ఒ ఎన్‌.రామచంద్రరావు ఉన్నారు.