Sep 29,2022 23:37

కల్వర్టు గొయ్యిలో కూరుకుపోయిన ఆటో

- కల్వర్టు గుంతలో కూరుకుపోయిన ఆటో
ప్రజాశక్తి-కొయ్యూరు :
మండలంలోని మంప నుంచి తుమ్మలబంద, పైడిపణుకుల తదితర గ్రామాలకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వాగుపై తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో బుధవారం కురిసిన వర్షానికి కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. గురువారం ఆ రహదారిలో వెళుతున్న ఆటో కల్వర్టుకు ఏర్పడిన గుంతల్లో కూరుకుపోయింది. వంతెన లేక ఇబ్బందులు పడుతున్నామని, వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.