అచ్చంపేట: మండల పరిధిలోని కొండూరు, చామర్రులలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండూరులో రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు నూతనంగా మంజూరైన వంద గృహాలకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గతంలో 390 ఉన్న పెన్షన్లు 600కు పైగా లబ్ధిదారుల ప్రతినెలా లబ్ధి పొందుతున్నారని అన్నారు. దారుణంగా ఉన్న కొండూరు , నిండుజర్ల దొడ్లేరు గ్రామాలకు తారు రోడ్డు ఏర్పాటు చేశామని, సుమారు రెండు కోట్లతో జలజీవన్ మెషిన్ కింద తాగునీటి ఏర్పాట్లు చేశామన్నారు. చామర్రులో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గడపగడపకు కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యా దులను ఏ మేరకు పరిష్కరించారో ఆయన అడిగి తెలుసు కున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వాటి పరిష్కారానికి 'మీకోసం శంకరన్న 'గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.










