Oct 09,2023 23:24

ఆర్డీఓ రాజకుమారి కి వినతిపత్రం అందజేస్తున్న చిత్రం

సత్తెనపల్లి రూరల్‌: కొండమోడు-పేరేచర్ల రోడ్డు విస్తరణ చేపట్టాలని సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అద్యక్షులు చిన్న బోయిన రాఘవరావు డిమాండ్‌ చేశారు. తెలుగుయువత ఆద్వర్యంలో టిడిపి నాయకులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ ప్రతినిత్యం యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, కాళ్లూచేతులు విరిగి కొందరు వికలాంగులుగా మారుతున్నారని అన్నారు. మాచర్ల-పిడుగురాళ్ల నుండి గుంటూరు వరకు ప్రతినిత్యం వేల మంది ప్రయాణం చేస్తున్నారని, రోడ్డుపై భారీ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పట ికైనా స్పందించి కనీసం తగుంతలు అయినా పూడ్చాలని కోరారు. అనంతంరం సత్తెనపల్లి ఆర్‌ డిఒ బిఎల్‌ ఎన్‌ రాజ కుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు ఎన్‌.కార్తీక్‌, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు ఎం.హను మంతరావు. నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి రంజాన్‌ వలి, సత్తెనపల్లి మండలం తెలుగు యువత ఉపాధ్యక్షులు టి.వెంకటేష్‌, సీనియర్‌ నాయకులు పి.వెంకట కోటయ్య, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.