
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కొండలు, బండలే దర్శనమిస్తాయి. వీటిపై ఆధారపడి వడ్డెర కార్మికులు జీవనం సాగిస్తున్నాయి. సుమారు 10 వేల మంది కొండలు, బండలు చేసి బతుకు బండి లాగిస్తున్నారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కావడంతో చుట్టుపక్కల కొండలన్నీ నేడు కరిగిపోతున్నాయి. ఫలితంగా వడ్డెరలకు చేతిలో పని లేకుండా పోయింది. కూలీలు కొండ అంత కష్టం చేస్తే గోరంత కూలి వస్తోందని పేర్కొన్నారు. దళారులు ఇష్టారాజ్యంగా దోచుకు తింటున్నారు. జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, కుప్పం ప్రాంతాలకు చెందినవారు కూలీలు కూడా ఇక్కడికి వచ్చి బండరాళ్లు, కంకర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పొట్టకూటి కోసం బతుకు బండిని ఎండనక, వాననక రాళ్లను పగలకొడుతూ వారిచ్చే అరకొర కూలితో కాలం గడుపుతున్నారు. రాళ్లు పగలగొట్టిన ప్రాంతంలో కొండలన్నీ సదాటి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కొందరు మట్టి, పోసి చదును చేసి పొలాలుగా, ఇండ్ల స్థలాలుగా మార్చుకుంటూ కుంటున్నారు. రాయచోటి జిల్లా కావడంతో ఇంటి స్థలాలకు గిరాకీ పెరిగింది. కానీ కూలీలకు మాత్రం ఒక బండరాయికి రూ. 7, 8 రూపాయలు, కూసాలకు రూ.200 మాత్రమే ఇస్తున్నారని రోజంతా కష్టపడితే రూ. 500 నుంచి వెయ్యి వరకు వస్తుందని,
రాళ్లు కొట్టి నడుములు, చేతుల నొప్పులతో అల్లాడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో రోజంతా పనిచేయాలంటే బండలు వేడెక్కడంతో చేతులకు బొబ్బలెక్కుతున్నాయని, చిన్న గాయాలు కూడా అవుతున్నాయా అని కార్మికులు వాపోతున్నారు. నెలలో 10, 15 రోజులు మాత్రమే పనులుంటాయని మిగిలిన ఖాళీగా ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. పనికి వెళ్తేనే తమ కుటుంబం పూట గడుస్తుందని కార్మికులు తెలుపుతున్నారు. కానీ కొంతమంది బండలను, కొండలను ఆక్రమించుకొని కూలీలను పెట్టుకొని రాళ్లను కొట్టిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు వరకైతే ఒక ట్రాక్టర్ రాయికి రూ.5 ఆపైన దూరం పెరిగితే రూ.6 పైగా రాళ్లను, కూసాలు రూ. 600 రూపాయలు, కంకర రాళ్లు ట్రాక్టర్ రూ.10 వేల రూపాయలు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం వడ్డెర కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
రాయి కొట్టే స్థలంలో వడ్డెర కార్మికులకు షెడ్లు, తాగునీరు వంటి సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. రాళ్లు కంకర కుట్టడం వల్ల కీళ్లు, నడుము నొప్పులు, అనారోగ్య సమస్యలొస్తున్నాయి. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజుకి మాత్రమే పూట గడుస్తుంది. రాయి కొట్టడానికి పరికరాలను ప్రభుత్వం సరఫరా చేయాలి.
- పి.వెంకట రమణ,కార్మికుడు,మాధవరం,రాయచోటి.
వడ్డెర కార్మికులను ఆదుకోవాలి
వడ్డెర్లు అనేకం దశాబ్దాలుగా రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వారి కష్టానికి పతిఫలం లేకుండా పోయింది. అనేక యంత్రాలు వచ్చేవాయి. జీవన ఉపాధి చాలా బరువెక్కింది. అందుకే వడ్డెర కులస్తులకు రావాల్సినటువంటి పనిముట్లు , కంకర మిషన్లు వచ్చి బతుకుల మీద పిడుగు పడ్డాయి. ప్రభుత్వాలు మారుతున్నా పథకాల మటుకు శూన్యం. కార్మికులందరికీ పనిముట్లు ఉచితంగా అందజేసి పెన్షన్, ఇన్సూరెన్స్ కార్డులను మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలి.
- కె. మారుతి శంకర్, ఎపి వడ్డెర విద్యావంతుల వేదిక జిల్లాప్రధాన కార్యదర్శి, రాయచోటి. అన్నమయ్య జిల్లా.కొండలు పిండి చేసినా.!
రాళ్లు కొట్టి నడుములు, చేతుల నొప్పులతో అల్లాడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో రోజంతా పనిచేయాలంటే బండలు వేడెక్కడంతో చేతులకు బొబ్బలెక్కుతున్నాయని, చిన్న గాయాలు కూడా అవుతున్నాయా అని కార్మికులు వాపోతున్నారు. నెలలో 10, 15 రోజులు మాత్రమే పనులుంటాయని మిగిలిన ఖాళీగా ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. పనికి వెళ్తేనే తమ కుటుంబం పూట గడుస్తుందని కార్మికులు తెలుపుతున్నారు. కానీ కొంతమంది బండలను, కొండలను ఆక్రమించుకొని కూలీలను పెట్టుకొని రాళ్లను కొట్టిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు వరకైతే ఒక ట్రాక్టర్ రాయికి రూ.5 ఆపైన దూరం పెరిగితే రూ.6 పైగా రాళ్లను, కూసాలు రూ. 600, కంకర రాళ్లు ట్రాక్టర్ రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం వడ్డెర కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
రాయి కొట్టే స్థలంలో వడ్డెర కార్మికులకు షెడ్లు, తాగునీరు వంటి సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. రాళ్లు కంకర కుట్టడం వల్ల కీళ్లు, నడుము నొప్పులొస్తున్నాయి. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజుకి మాత్రమే పూట గడుస్తుంది. రాయి కొట్టడానికి పరికరాలను ప్రభుత్వం సరఫరా చేయాలి.
- పి.వెంకట రమణ,కార్మికుడు,మాధవరం,రాయచోటి.
వడ్డెర కార్మికులను ఆదుకోవాలి
వడ్డెర్లు అనేకం దశాబ్దాలుగా రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వారి కష్టానికి పతిఫలం లేకుండా పోయింది. అనేక యంత్రాలు వచ్చేవాయి. జీవన ఉపాధి చాలా బరువెక్కింది. అందుకే వడ్డెర కులస్తులకు రావాల్సినటువంటి పనిముట్లు , కంకర మిషన్లు వచ్చి బతుకుల మీద పిడుగు పడ్డాయి. ప్రభుత్వాలు మారుతున్నా పథకాల మటుకు శూన్యం. కార్మికులందరికీ పనిముట్లు ఉచితంగా అందజేసి పెన్షన్, ఇన్సూరెన్స్ కార్డులను మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలి.
- కె. మారుతి శంకర్, ఎపి వడ్డెర విద్యావంతుల వేదిక జిల్లాప్రధాన కార్యదర్శి, రాయచోటి. అన్నమయ్య జిల్లా.