
ప్రజాశక్తి - మాచర్ల : ఎన్నికలకు ముందు టెంకాయి కొడితే అది ప్రజలను మోసం చేసేందుకెే అన్న జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మాటలు మర్చిపోయారేమో గుర్తు చేసుకోవాలని టిడిపి మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృషా ్ణరెడ్డికి నాలుగున్నరేళ్లుగా గుర్తుకు రాని నియోజకవర్గ సమస్యలు నిన్న అడగటం, ఆయన ఆలోచిస్తామనటం ప్రజలను మోసం చేయాటానికేనన్నారు. అనుమ తులు లేకుండా కొండలు తవ్వటం, గనులు తవ్వటం మాచర్ల ఎమ్మెల్యే పని అని, ఎక్కడ వైసిపి ప్రభుత్వం మీటింగ్‌లు పెట్టినా స్కూల్స్, షాపులు మూతపడా ల్సిందేనని విమర్శించారు. సిఎం సభలో మద్యం ఏరులై పారిందని, బల ప్రదర్శన కోసం చేసిన సభే కాని, ఇక్కడ రైతులకు ఉపయోగం లేదని అన్నారు. సమావే శంలో నాయకులు ఎం.దాసు, జి.సీతారెడ్డి, ఎం.రాంబాబు, కె.దుర్గారావు, నాగూర్ బాషా, బి.కృష్ణవేణి, బాలశౌరి పాల్గొన్నారు.