
పిల్ వేసిన కాపీలు చూపిస్తున్న న్యాయవాది జై భీమ్ శ్రీ నివాస్
ప్రజాశక్తి - నందిగామ : నందిగామ, పరిటాల గ్రామంలో ఉన్న సర్వే నెంబరు 801లో కొండలపై విచక్షణారహితంగా ఎక్కువ కొండల తవ్వకాలు జరుగుతున్న దానిపై బుధవారం హైకోర్టులో పిల్ నెంబర్ 173/2023 ఫైల్ చేసినట్లు తెలిపారు. న్యాయవాది జైభీమ్ శ్రీనివాస్ తెలిపారు. పిటిషన్ తరపున ప్రముఖ న్యాయవాది జైభీమ్ శ్రీనివాస్ బుధవారం ప్రకటన ద్వారా తెలుపుతూ వాదనలు వినిపించడంతో వాదనలతో ఎకీభవించిన హైకోర్టు వారు అందులో ఉన్న ప్రతి వాదులకు మైనింగ్, పోలీసు డిపార్ట్‌మెంట్ వారికి నోటీసులు జారీ చేయమని ఆదేశించారన్నారు. సదరు పిల్‌లో మైనింగ్ డిపార్ట్‌మెంట్ వారు 93 మందికి ఇచ్చిన లీజు పర్మిషన్‌ను రద్దుచేయాలని అడిగినట్లు శ్రీనివాస్ తెలిపారు.