ప్రజాశక్తి- సీతంపేట: టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం సోమవారం మండలంలోని కొండాడలో నిర్వహించారు. జయక్రిష్ణ మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు అందిస్తామని అన్నారు. తల్లికి వందనం పేరున ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15 వేల రూపాయలు అందిస్తామన్నారు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి 20వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. యువగలం పేరుతో డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకి 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సవరతోట మొఖలింగం, ఐటిడిపి హిమరక పవన్, యూనిట్ ఇంచార్జ్ బిడ్డీక ప్రవీణ్ సాయి, సవర చుక్కయ్య, సవర వెంకట రావు, క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్ ఇంచార్జ్, బూత్ ఇంచార్జ్, గ్రామా కమిటీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
కురుపాం: మండలంలో గుజ్జువాయి పంచాయతీలో నేరేడుమానుగూడ గ్రామంలో సోమవారం సాయంత్రం టిడిపి మండల కన్వీనర్ కెవి కొండయ్య ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ మీడియా కోఆర్డినేటర్ సుఖేష్ చంద్ర పండ మానిఫెస్టోలు గూర్చి టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ కోప్సన్ సభ్యులు రంజిత్ కుమార్ నాయక్, యూనిట్ ఇంఛార్జిలు బిడ్డిక నాగేష్, బెహరా శ్రీను, బిడ్డిక భాస్కరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.










