
ప్రజాశక్తి - భవానీపురం : కొండిపాంతాల నివాసితులకు మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్ పుండ్కర్ తగిన చర్యలు తీసుకోవాలని జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం 45వ డివిజన్‌లోని కొండిపాంతంలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఎక్కడకు వెళ్లినా ప్రజలు మెట్లు, రోడ్లు, సైడు కాల్వలు, రిటైనింగ్ వాల్స్ లేకపోవడం వంటి సమస్యలను చెబుతున్నారని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ఇఒల బదిలీ చాలా గందరగోళంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్ము రాంబాబు, బొమ్ము గోవింద లక్ష్మి, శనివారపు శివ, క్రిష్, కూర్మారావు, రాము గుప్తా, కళ్యాణ్,అఖిల తదితరులు పాల్గొన్నారు.