ప్రజాశక్తి - గోనెగండ్ల
జగనన్న విద్యా కానుకలో కొలతల్లో తేడాలుంటే తెలపాలని జిసిడిఒ సునీత తెలిపారు. బుధవారం గోనెగండ్ల జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్‌ను ఆమె తనిఖీ చేశారు. బస్టాండ్ వెనుక పాఠశాల స్టాక్ పాయింట్‌ను పరిశీలించి క్వాలిటీ వాల్ స్టాల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలంలోని 11,872 మంది విద్యార్థులకు సంబంధించి స్టాక్ పాయింట్‌కు చేరిన షూస్, యూనిఫారం, డిక్షనరీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించామని తెలిపారు. అలాగే సంబంధిత సిబ్బంది షూస్‌కు సంబంధించిన సైజులను కొలతల మేరకే ఉన్నాయా లేదా నిర్ధారించి తమకు తెలియజేస్తే కొలతలు సరిగా లేకపోతే వెనక్కి పంపి విద్యార్థులకు అవసరమైన కొలతల మేరకు తిరిగి తెప్పిస్తామని వివరించారు. సిఆర్‌పిలు పుల్లన్న, రవికుమార్, విజయ, రాణి, చెన్నకేశవులు పాల్గొన్నారు.
రికార్డులు తనిఖీ చేస్తున్న జిసిడిఒ










