ప్రజాశక్తి - కొల్లూరు
మండలంలోని పేదలకు ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ ఫీజుతో అందిస్తున్న జివిఆర్ ఎస్ఏఆర్ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్షులు మనోజ్ కోరారు.అండ్ కళాశాలలో ఉన్న ఎయిడెడ్ స్టాఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం జీవో నెంబర్ 42 తీసుకొచ్చి ప్రభుత్వంలో తీసుకున్న ఫలితంగా ఇప్పుడు కళాశాల ప్రైవేటుగా మారిందని తెలిపారు. దీంతో విద్యార్థులకు ప్రభుత్వ ఫీజులతో ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ కళాశాల లేనందున దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. డబ్బులు లేని విద్యార్థులు చదువులు మానేసి ఇంటికి పరిమితం అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం పేద విద్యార్థులకు నష్టం చేకూర్చిందని అన్నారు. కొత్తగా కొల్లూరు బాలికోన్నత పాఠశాలలో స్కూల్ ప్లస్ పేరుతో ఇంటర్ విద్యను అందిస్తామని చెప్పి అక్కడా ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. ఈ ప్రాంత పేద విద్యార్ధులకు అందుబాటులో జివిఆర్ అండ్ ఏఎస్ఆర్ ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని కోరారు. ఈ కళాశాల నుండి ప్రభుత్వం తీసుకున్న లెక్చరర్లను అదేవిధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎస్ఎఫ్ఐ నాయకులు మదన్ వరుణ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొనిగల సుబ్బారావు పాల్గొన్నారు.










