Aug 08,2021 17:05

సియోల్‌ : కొడుకు పనిచేయకుండా ఇంట్లోనే కూర్చోవడంతో అతనిని బాగుచేయాలని దక్షిణ కొరియాకు చెందిన తండ్రి ఓ వినూత్న ఆలోచన చేశాడు. అదే అతనికి రూ. 36 కోట్ల ఆస్తిని తెచ్చిపెట్టింది. చెత్తను పోగు చేయడంతో వాసన భరించలేక కొడుకు ఇంట్లో నుండి వెళ్లి పోతాడనుకున్నాడు. అదే పనిగా చెత్తను పేర్చడం ప్రారంభించాడు. దశాబ్దం పాటు ఈ విధంగా చెత్తను పోగు చేయడంతో .. వాసన భరించలేక భార్య అనారోగ్యం పాలైంది. చెత్తను శుభ్రం చేయకపోతే ప్రమాదమని హెచ్చరించడంతో.. వైద్యుల సలహా మేరకు చెత్తను తొలగించాలనుకున్నాడు. ఆ చెత్తనంతా అమ్మితే అతనికి ఏకంగా రూ.36 కోట్లు వచ్చిపడ్డాయి. కొడుకుని బాగు చేద్దామనుకుంటే.. కోట్లు వచ్చాయనుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. చుట్టుపక్కల వాళ్లు 'కొడుకు కోసం చెత్తనే ఆస్తిగా పోగుచేసినట్లుందే' అంటూ నోళ్లు వెళ్ల బెట్టారు. ఏదైతేనేం పనిచేయని కొడుక్కి చెత్తతోనే ఆస్తిని సంపాదించి పెట్టాడు తండ్రి.