ప్రజాశక్తి - టి.నరసాపురం
కొబ్బరి సాగు రైతులు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని విజయరాయి ఉద్యాన కేంద్రం పరిశోధకులు తిరుపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఉద్యాన, కొబ్బరి అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో రైతులకు కొబ్బరి సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కొబ్బరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. చీడపీడల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. సూక్ష్మ పోషక దాతు లోపాలు లేకుండా చూడాలన్నారు. సవరణ పద్ధతులు పాటించాలన్నారు. కొబ్బరి సాగులో అంతర పంటలు కూడా సాగు చేయడం లాభదాయకమన్నారు. రైతులందరూ సాగు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ సాగుపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మోదుగు సునంద, ఉద్యాన అధికారి లఖ్‌పతి, సిబిడి సాంకేతిక అధికారి కిరణ్, రైతులు పాల్గొన్నారు.










