Sep 22,2023 21:38

ప్రజాశక్తి - వీరవాసరం
           కొబ్బరి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 26వ తేదీన నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా, సదస్సు నిర్వహించనున్నట్లు ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరే రామ్‌ తెలిపారు. శుక్రవారం నవుడూరులో కొబ్బరి రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఆకుల హరేరామ్‌ మాట్లాడుతూ కొబ్బరి రైతులం దరూ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపుని చ్చారు. ఈ సదస్సులో కొబ్బరి రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు అధ్యక్ష, కార్యద ర్శులు జుత్తిగ నరసింహమూర్తి, ఆకుల హరేరామ్‌ తెలిపారు. చెట్టు నుంచి కొబ్బరికాయ కోసి గుట్టగా వేయడానికి కాయకు రూ.మూడు ఖర్చవుతుందన్నారు. ఎకరానికి కొబ్బరి తోటకు రూ.60 వేలకు పైగా పెట్టుబడి అవుతుందని తెలిపారు. రైతు చేతికి కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాక కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్లే కొబ్బరి రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. కొబ్బరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర ఏమాత్రం సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరల స్థరీకరణ నిధి పథకం వర్తింపచేసి కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిలాడి సత్యనారా యణ, తాళ్లూరి హరే రామలక్ష్మణ్‌, అయినంపూడి బాబూరావు, మైగాపుల త్రిమూర్తులు, చెన్నూరి సుబ్బారావు పాల్గొన్నారు.