ప్రజాశక్తి-అమలాపురం
కొబ్బరి పంట అభివృద్ధి, విలువ ఆధారత పరిశ్రమల ప్రోత్సాహకానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కేంద్ర బందాన్ని కోరారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారిని బంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక కలెక్టరేట్ నందు బందానికి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కొబ్బరి సాగు, విలువ ఆధారిత పరిశ్రమల ఆవశ్యకతపై రూపొం దించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ పై అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో భాగంగా ముమ్మిడివరం లో ఏర్పాటు చేసినటువంటి వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూనిట్ నుండి ఉత్పత్తి చేసే కొబ్బరి ఉత్పాదకాల గురించి జిల్లా కలెక్టర్ బందానికి వివరించారు. పేరూరు గ్రామంలో గల స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన కొబ్బరి తాళ్ల తయారీ ఇండిస్టీ ని కొబ్బరి ప్యాక్ హౌస్ ను సందర్శించి వారితో బంద సభ్యులు ముఖా ముఖీ ఉత్పత్తులపై ఆరా తీశారు. మామిడికుదురు గ్రామంలో హస్తకళ ల సంస్థ ద్వారా తయారు చేస్తున్న క్వాయర్ బొమ్మలు యూనిట్లో సందర్శించి అనంతరం మామిడి కుదురు మండలం పాశర్లపూడి లో నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించు చున్న కొబ్బరి పీచుతో తయారు చేయు బొమ్మలు దుకాణం గురించి తదితర కొబ్బరి ఉత్పాది త యూనిట్లను బందం సందర్శించి అధ్యయనం చేసిందన్నారు. పెదపట్నంలంక గ్రామంలో ఏర్పాటు చేసిన కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల స్టాల్ ను సందర్శించి క్షుణ్ణంగా పరిశీలిం చారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి బివి.రమణ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వరప్రసాద్, డిఆర్‌డిఎ, పథక సంచాలకులు డాక్టర్ బి.శివ శంకర్ ప్రసాద్‌తదితరులు పాల్గొ న్నారు. మామిడికుదురుకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి ప్రోత్సహకంలో భాగంగా కేంద్ర బందం గురువారం జిల్లా లో కలెక్టర్ హిమాన్షు శుక్లా వారి ఆధ్వర్యంలో గురువారం పెదపట్నంలంకలో శ్రీ సాయిలక్ష్మీ క్వాయర్ ఇండిస్టీస్ నందు క్షేత్ర స్థాయి సందర్శన, మరియు అవగాహన కల్పించారు.










