ప్రజాశక్తి - దేవరాపల్లి
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం నేరుగా ప్రజలకు తెలిసే విధంగా సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమిష్టిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. స్థానిక రైవాడ అతిథి గృహం వద్ద గురువారం మండల వాలంటీర్ల సమీక్ష సమావేశం జరిగింది. మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బూడి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో భాగంగా కలిసిమెలిసి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, కన్వీనర్లు, వాలంటీర్లు అలసత్వం వహిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు ఉరుకూటి అప్పారావు, ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జడ్పిటిసి కర్రి సత్యం, వైసిపి మండల అధ్యక్షులు బూరె బాబురావు, ఎంపీడీవో సిహెచ్ సుబ్బలక్ష్మి, గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులకు అందుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ వైసిపి బలోపేతానికి కృషి చేయాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. నూతనంగా నియమించిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, ముఖ్య నాయకులతో సమావేశం శుక్రవారం బుచ్చయ్యపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాకవరపు నాగేశ్వరావు దేవి నాగరాజు, .జెడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ దొండా నారాయణమూర్తి, సర్పంచ్ మరిసానాని, ఎంపీటీసీ దేవర అప్పారావు యాదవ్, వైసిపి నాయకులు కొల్లిమల్ల అచ్చం నాయుడు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : వాలంటీర్లు సేవలు అమోఘమని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు అన్నారు. అచ్యుతాపురం మండల సముదాయం గ్రౌండ్లో వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బంది, నూతనంగా నియమిస్తున్న కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎలమంచిలి నియోజకవర్గ పరిశీలకులు రొంగలి జగన్నాథం, ఎంపిపి కోన సంధ్య, జడ్పిటిసి సభ్యులు లాలం రాంబాబు, పార్టీ నాయకులు దేశం శెట్టి శంకర్రావు, నర్మల కుమార్, కోన బుజ్జి పాల్గొన్నారు.










